Vadivelu: సినీ నటుడు వడివేలు ఇంట మరో విషాదం

Actor Vadivelu brother passes away

  • వడివేలు తమ్ముడు జగదీశ్వరన్ మృతి
  • కాలేయం పూర్తిగా పాడవడంతో ఆసుపత్రిలో కన్నుమూత
  • ఇటీవలే తల్లిని కోల్పోయిన వడివేలు

ప్రముఖ సినీ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్ మృతి చెందారు. 55 ఏళ్ల జగదీశ్వరన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతింది. జగదీశ్వరన్ సినిమాల్లో కూడా నటించారు. అయితే అవకాశాలు రాకపోవడంతో మధురైకి వెళ్లిపోయి బట్టల షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఇటీవలే వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా కలుకోక ముందే ఆయన తమ్ముడు మృతి చెందారు.

  • Loading...

More Telugu News