Gadari Kishor: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కు హైకోర్టులో చుక్కెదురు
- గాదరి కిశోర్ ఎన్నికల చెల్లదంటూ హైకోర్టులో అద్దంకి దయాకర్ పిటిషన్
- ఆ పిటిషన్ కొట్టివేయాలంటూ ఐఏ దాఖలు చేసిన గాదరి కిశోర్
- ఐఏను డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
- సాక్షుల లిస్ట్ ఫైల్ చేయాలని ఆదేశాలు
- తదుపరి విచారణ సెప్టెంబరు 4కి వాయిదా
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ కొట్టివేయాలంటూ గాదరి కిశోర్ హైకోర్టులో ఐఏ (ఇంటర్ లాక్యూటరీ అప్లికేషన్) దాఖలు చేశారు.
అయితే, గాదరి కిశోర్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గాదరి కిశోర్ ఐఏ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సాక్షుల లిస్ట్ ఫైల్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 4కి వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్ లో గాదరి కిశోర్ తప్పుడు సమాచారం అందించారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని అద్దంకి దయాకర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.