Dharmana Prasad: వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వలంటీర్లుగా నియమించాం.. వారి ద్వారానే పథకాలు అందుతున్నాయి: మంత్రి ధర్మాన

The children mentioned by YCP leaders appointed as volunteers says AP minister Dharmana

  • అధికారాలు తీసేశారన్న బాధ కార్యకర్తల్లో ఉందన్న మంత్రి
  • పార్టీ సిద్ధాంతాలను అర్ధం చేసుకోవాలని సూచన
  • ధర్మాన కృష్ణదాసు ప్రమాణస్వీకారంలో మంత్రి వ్యాఖ్యలు

వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వలంటీర్లుగా నియమించామని, వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుతోపాటు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న శ్రీకాకుళంలో జరిగింది. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని అన్నారు. దీనివల్ల తమ చేతిలో ఉన్న అధికారాలు తీసేశారనే ఆవేదన, బాధ కార్యకర్తల్లో ఉందన్నది వాస్తవమేనని, తాను కాదనని అన్నారు. ఇలా అయితే, ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు.

  • Loading...

More Telugu News