money tips: సంపాదనాపరులైన యువతకు 5 మనీ టిప్స్!

Edelweiss CEO Radhika Gupta shares 5 money tips for youngsters who have just started earning

  • ఉద్యోగం మొదలు పెట్టిన వెంటనే పెట్టుబడి
  • ముందుగా ఆరంభించడం వల్ల మెరుగైన వృద్ధి
  • లక్ష్యాలు సులభంగా సాధించొచ్చు
  • ఎడెల్ వీజ్ ఏఎంసీ సీఈవో రాధికా గుప్తా సూచనలు

కాలం ఎంతో విలువైనది. సంపద సమకూర్చుకోవడంలో కాలం అన్నింటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ముందుగా పెట్టుబడులు ప్రారంభించడం వల్ల దీర్ఘకాలంలో అది ఎక్కువ పిల్లలు పెట్టే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. 20ల్లో ప్రారంభిస్తే రెండు నుంచి మూడు దశాబ్దాల పాటు అవి గణనీయంగా వృద్ధి చెందడానికి వీలుంటుంది. ఉద్యోగం/కెరీర్ ఆరంభించిన వెంటనే ఆచరణలో పెట్టాల్సిన ఐదు డబ్బు చిట్కాలను ఎడెల్ వీజ్ అస్సెట్ మేనేజ్ మెంట్ సీఈవో రాధికా గుప్తా సూచించారు.

ముందుగా ఆరంభించాలి..
పెట్టుబడులు ప్రారంభించడమే లక్ష్యం కావాలి కానీ, రాబడులు కాదు. అంటే ఆ పెట్టుబడి ఎంత మేర పెరుగుతుంది, ఎన్ని రెట్లు అవుతుందన్న లెక్కలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం మొదలు పెట్టిన రెండేళ్ల తర్వాత పొదుపు, మదుపు  ఆరంభించడాన్ని చెడ్డ ఆలోచనగా ఆమె పేర్కొన్నారు. ముందుగా ఆరంభించడం వల్ల తర్వాత కాలంలో బలమైన నిర్ణయాలు తీసుకునే ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. ఆలస్యం చేయడం వల్ల ఆ తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. 

సరైన కేటాయింపులు
20 ఏళ్ల ఆరంభంలో ఉన్న వారు అయినా నూరు శాతం పెట్టుబడులు తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. అత్యవసరాల కోసం కొంత మొత్తాన్ని డెట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకటికి మించి సాధనాలకు కేటాయింపులు చేయడాన్ని అస్సెట్ అలోకేషన్ గా చెబుతారు. 

సరళంగా.
పెట్టుబడులు అనేవి సరళతరంగా ఉండాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో బ్యాలన్స్ డ్ అడ్వాంటేజ్ ఫండ్, మిడ్/స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. 

స్పష్టత ఉండాలి..
ముందుగా పెట్టుబడులు ఆరంభించే వారు తమ లక్ష్యాలు, సూత్రాల గురించి పేపర్ పై రాసుకోవాలి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు? అన్నది కూడా రాసుకోవాలి. అలాగే, ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదు? ఎందుకు అనే వివరాలు కూడా ఉండాలి. మంచి, చెడు పనితీరు మధ్య తేడా తెలుసుకోవాలి.

ఆనందం కోసం..
పొదుపు, మదుపు చేయడం ముఖ్యమే. అలాగే, ఆ డబ్బుతో ఆనందించడం కూడా అవసరమే. నచ్చిన వాటి కోసం ఖర్చు పెట్టడం అవసరమే అంటున్నారు రాధికా గుప్తా. ‘‘చిన్న కోరికల నుంచి సొంతిల్లు వంటి పెద్ద లక్ష్యాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్వెస్ట్ చేసేది లక్ష్యాలను సాధించి, మెరుగ్గా జీవించడం కోసమే’’ అని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News