Vishal: విజయ్‌ పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్‌ ఆసక్తికర కామెంట్స్

I will welcome Vijays political entry says Vishal

  • నిన్న 46వ జన్మదినాన్ని జరుపుకున్న విశాల్
  • కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన స్టార్ హీరో
  • విజయ్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని వ్యాఖ్య

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం ఇటీవలి కాలంలో మరింత ఊపందుకుంది. మరోవైపు, విజయ్ పొలిటికల్ ఎంట్రీపై మరో హీరో విశాల్ స్పందించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తే మనసారా అభినందిస్తానని చెప్పాడు. విశాల్ నిన్న 46వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. చెన్నైలోని కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ ను కట్ చేశాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తల్లి కోయంబేడు మార్కెట్ లోనే పూలు, కాయగూరలు కొంటారని చెప్పాడు. తనను 19 ఏళ్లుగా హీరోగా ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలను తెలియజేశాడు. అనంతరం కీల్పాక్ లోని అనాధాశ్రమానికి వెళ్లి అక్కడున్న చిన్నారుల మధ్య కేక్ ను కట్ చేశాడు. చిన్నారులతో కలిసి కొంత సమయాన్ని గడిపాడు. ఆ తర్వాత తన తాజా చిత్రం యూనిట్ సభ్యుల మధ్య కూడా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News