BSNL: ఐదు నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... ఓ లుక్కేయండి!
- వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నం
- రూ.397 ధరతో రీచార్జ్ ప్లాన్
- ఐదు నెలల పాటు వ్యాలిడిటీ
- అయితే ఇతర ప్రయోజనాలు 30 రోజులకే పరిమితం
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్ తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్ లో తక్కువ ధరకే అధిక వ్యాలిడిటీ లభిస్తుండడం విశేషం. ఈ సూపర్ రీచార్జ్ ప్లాన్ ధర రూ.397. దీనితో 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
అయితే, వ్యాలిడిటీ 5 నెలలు ఉంటుంది కానీ, ఇతర ప్రయోజనాలు మాత్రం పరిమితం చేశారు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ డేటా, రోజూ ఉచితంగా 100 ఎస్సెమ్మెస్ లు కేవలం 30 రోజులు మాత్రమే లభిస్తాయి. ఫోన్ లో రెండు సిమ్ లు కలిగి ఉండి, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
అయితే కొన్ని టెలికాం సర్కిళ్లలో ఇదే ప్లాన్ పై 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్టు తెలుస్తోంది.