Team India: నేటి నుంచే ఆసియా కప్.. ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ
- కేఎల్ రాహుల్ కు మరో గాయం
- తొలి రెండు మ్యాచ్‌లకు దూరం
- అందుబాటులోకి శ్రేయస్ అయ్యర్
పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ ఈ రోజు మొదలవుతోంది. మంగళవారం బెంగళూరులో చివరి ప్రాక్టీస్ సెషన్ లో చెమటలు చిందించి శ్రీలంక వెళ్లింది. అయితే, ఈ టోర్నీకి ముందు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. తొడ గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను మరో గాయం వేధిస్తోంది. దీంతో సెప్టెంబర్ 2, 4న పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. అతను జట్టుతో పాటు శ్రీలంకకు వెళ్లకుండా ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు. తను సూపర్–4 స్టేజ్ నుంచి అందుబాటులోకి వస్తాడని ద్రవిడ్ చెప్పాడు.
బెంగళూరులో వారం రోజు పాటు జరిగిన శిక్షణ శిబిరంలో అతను బాగా బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. కానీ చిన్న గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని వెల్లడించాడు. సెప్టెంబర్ 4న అతని గాయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కేఎల్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనుండగా.. సంజూ శాంసన్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటాడు. ఇక గాయం నుంచి కోలుకున్న మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాలుగో నంబర్ లో బ్యాటింగ్ చేస్తాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.