adhaar card: ఆధార్ ఉచిత అప్ డేట్ కు సమీపిస్తున్న గడువు

know the last date to update your adhaar card free of cost

  • ఇప్పటికే పలుమార్లు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
  • సెప్టెంబర్ 14 తో ముగియనున్న గడువు
  • ఆ తర్వాత ఆధార్ లో మార్పులకు సొమ్ము చెల్లించాల్సిందే

ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14 చివరి తేదీ అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆ తర్వాత పేరు మార్పుతో పాటు ఇతరత్రా మార్పులకు తగిన రుసుము వసూలు చేస్తామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని, అయితే, కార్డులో వివరాలు మార్చేందుకు నిర్ణీత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఆధార్ లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్, అడ్రస్.. తదితర వివరాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.

ఇంట్లోనే ఆధార్ అప్ డేట్ ఇలా..
ఆధార్ నంబర్ ద్వారా మై ఆధార్ పోర్టల్ లోకి లాగిన్ అయి అడ్రస్ అప్ డేట్ ఆప్షన్ ఎంచుకుంటే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది.. దానిని ఎంటర్ చేశాక డాక్యుమెంట్ అప్ డేట్ క్లిక్ చేస్తే ఆధార్ కార్డులోని మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ సరిచూసుకుని, మార్పులు ఉంటే చేసి నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు చేసిన మార్పులను ధ్రువీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేశాక మీ మొబైల్ కు ఆధార్ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తో ఆధార్ అప్ డేషన్ ప్రాసెస్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

  • Loading...

More Telugu News