traffic police: గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కమిషనర్

Traffic Commissioner save person life in Begumbpet with CPR

  • బేగంపేటలో గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తి
  • వెంటనే సీపీఆర్ చేసిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
  • ఆ తర్వాత అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలింపు
  • ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్‌పై ప్రశంసల వెల్లువ

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఓ వ్యక్తి కిందపడిపోగా నార్త్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలయోగి తదితరులు ఆయనకు సీపీఆర్ చేసి కాపాడారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. బుధవారం బేగంపేటలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి గుండెపోటు రావడంతో రోడ్డు మీద పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారి మధుసూదన్ రెడ్డి అతనిని గమనించి సీపీఆర్ చేశారు. ఆయనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయం చేశారు. ఆ తర్వాత బాధితుడిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News