India: అభిమానుల్లో టెన్షన్.. భారత్‌-పాక్ మ్యాచ్‌కు వానతో అంతరాయం తప్పదా..?

Meteorological department predicts rain during pak india match in Srilanka

  • ఆసియా కప్‌లో భాగంగా దాదాపు 4 ఏళ్ల తరువాత శనివారం భారత్-పాక్ మ్యాచ్
  • దాయాది  దేశాల ప్రజలతో పాటూ యావత్ క్రికెట్ ప్రపంచం మ్యాచ్ కోసం ఎదురుచూపులు
  • శనివారం జరిగే మ్యాచ్‌కు వాన ముప్పు ఉందన్న వాతావరణ శాఖ
  • వాన పడే చాన్స్ 90 శాతం ఉందన్న ప్రకటనతో అభిమానుల్లో టెన్షన్

చిరకాల ప్రత్యర్థులు, దాయాది దేశాలైన భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల వారితో పాటూ యావత్ క్రికెట్ అభిమానులకూ పండగే. దాదాపు నాలుగేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య ఆసియా కప్ టోర్నమెంట్‌లో వన్డే మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. అయితే, వారి ఆనందంపై నీళ్లు జల్లేందుకు వరుణుడు రెడీ అవుతున్నాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం శ్రీలంకలోని కాండీలో జరిగే మ్యాచ్‌ సందర్భంగా వాన కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ అంచనా. వాతావరణంలో తేమ 84 శాతంగా ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, క్రికెట్ అభిమానులు డీలా పడిపోయారు. ఉత్కంఠ పోరును మిస్ ఆవుతామన్న టెన్షన్‌లో కూరుకుపోయారు.

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా బుధవారం శ్రీలంకకు చేరుకుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీం సభ్యులందరూ ప్రత్యేక బస్సులో ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లారు. ఇక సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నమెంట్‌లో రంగంలోకి దిగుతుంది.

  • Loading...

More Telugu News