Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు 200 రోజులు... విశేషాలు ఇవిగో!
- జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ యువగళం
- కుప్పంలో తొలి అడుగు వేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
- 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు... ఇదే లోకేశ్ టార్గెట్
- ఇప్పటివరకు 2,710 కిలోమీటర్ల పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతం గోదావరి జిల్లాలకు చేరుకుంది.
మొత్తం 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలన్నది లోకేశ్ టార్గెట్. కానీ ఆయన ముందే లక్ష్యానికి చేరుకోనున్నారు. లోకేశ్ రోజుకు సగటున 13.5 కిలోమీటర్లు నడుస్తున్నారు. మధ్యలో ఒకట్రెండు రోజులు కోర్టు పనులు, కొన్ని కుటుంబ పరమైన కారణాల వల్ల విరామం ప్రకటించారు తప్ప, మరే ఇతర కారణాలతోనూ పాదయాత్రను ఆపలేదు.
ఇప్పటివరకు లోకేశ్ పాదయాత్ర ఎలా సాగిందంటే...
- ఆగస్టు 31తో లోకేశ్ పాదయాత్రకు 200 రోజులు
- 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్లు నడిచిన లోకేశ్
- 185 మున్సిపాలిటీలు, మండలాలు, 1675 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర
- రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కి.మీ మేర పాదయాత్ర
- ఇప్పటిదాకా 64 బహిరంగ సభల్లో పాల్గొన్న లోకేశ్... 132 ముఖాముఖి సమావేశాల నిర్వహణ... 8 రచ్చబండ సమావేశాలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
- ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేకువ జాము 3.30 గంటల వరకు పాదయాత్ర కొనసాగించడం హైలైట్.
- పాదయాత్ర సందర్భంగా లోకేశ్ పై పలు కేసులు నమోదు
- నిత్యం లోకేశ్ ను కలిసేందుకు క్యాంప్ సైట్ల వద్దకు భారీగా జనం
- నెల్లూరులో అత్యధికంగా ఒక్కరోజులో 2,500 మందితో లోకేశ్ సెల్ఫీలు
- యువగళం పాదయాత్రలో ఆధునిక టెక్నాలజీ వినియోగం... లోకేశ్ తో సెల్ఫీలు దిగిన వారి ఫొటోలను స్కాన్ చేయించి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే పంపించే ఏర్పాటు.
- జులై 27న ఒంగోలు రవిప్రియ మాల్ వద్ద నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి విశేష స్పందన
- జులై 3న నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో మహాశక్తితో లోకేశ్ పేరిట మహిళలతో నిర్వహించిన సమావేశానికి అనూహ్య స్పందన
- ఫిబ్రవరి 2న తిరుపతిలో యువతతో నిర్వహించిన హలో లోకేశ్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన యువతీయువకులు
- ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా శింగనమలలో నిర్వహించిన రైతన్నతో లోకేశ్ కార్యక్రమానికి భారీగా విచ్చేసిన రైతులు
- వినూత్న రీతిలో లోకేశ్ సెల్ఫీ చాలెంజ్
1. చిత్తూరు- 14 నియోజకవర్గాల్లో 577 కిలోమీటర్లు- 45 రోజులు
2. అనంతపురం- 9 నియోజకవర్గాల్లో 303 కిలోమీటర్లు- 23 రోజులు
3. కర్నూలు- 14 నియోజకవర్గాల్లో 507 కిలోమీటర్లు- 40 రోజులు
4. కడప- 7 నియోజకవర్గాల్లో 200 కిలోమీటర్లు- 16 రోజులు
5. నెల్లూరు- 10 నియోజకవర్గాల్లో 459 కిలోమీటర్లు- 31 రోజులు
6. ప్రకాశం- 8 నియోజకవర్గాల్లో 220 కిలోమీటర్లు- 17 రోజులు
7. గుంటూరు- 7 నియోజకవర్గాల్లో 236 కిలోమీటర్లు- 16 రోజులు
8. కృష్ణా జిల్లా- 6 నియోజకవర్గాల్లో 113 కిలోమీటర్లు- 8 రోజులు
9. పశ్చిమ గోదావరి జిల్లా- 2 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు పాదయాత్ర