Asia Cup: ఆసియా కప్: బంగ్లాదేశ్ ను తేలిగ్గా ఓడించిన శ్రీలంక

Sri Lanka beat Bangladesh by 5 wickets in Asia Cup league match

  • ఆసియా కప్ లో శ్రీలంక శుభారంభం
  • సొంతగడ్డపై రాణించిన లంకేయులు  
  • తొలుత బ్యాటింగ్ చేసి 42.4 ఓవర్లలో 164 పరుగులకు బంగ్లా ఆలౌట్
  • 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన లంక

ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య శ్రీలంక శుభారంభం చేసింది. ఇవాళ బంగ్లాదేశ్ లో పల్లెకెలెలో జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో సునాయాసంగా నెగ్గింది. 165 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు మరో 11 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. లక్ష్యఛేదనలో శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. 

అంతకుముందు, బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అది ఎంత పొరపాటు  నిర్ణయమో బంగ్లా బ్యాటింగ్ చూస్తే అర్థమవుతోంది. ఆ జట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం, ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్ కూడా ఆరంభంలో కుదుపులకు గురైంది. 

43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక జట్టును సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ విలువైన భాగస్వామ్యం నమోదు చేసి తమ జట్టును గెలుపు దిశగా నడిపించారు. సమరవిక్రమ 77 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేయగా, చరిత్ అసలంక 92 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ షకీబల్ హసన్ 2, తస్కిన్ అహ్మద్ 1, షోరిఫుల్ ఇస్లామ్ 1, మెహెదీ హసన్ 1 వికెట్ తీశారు. ఆసియా కప్ లో తదుపరి మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబరు 2న జరగనుంది. ఈ దాయాదుల సమరం పల్లెకెలె స్టేడియంలో జరగనుంది.

  • Loading...

More Telugu News