Hemant Soren: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు మరోసారి ఈడీ నోటీసులు
- ఝార్ఖండ్ సీఎంను వదలని ఈడీ
- తాజాగా ఓ భూ కబ్జా కేసులో నోటీసులు
- ఈ నెల 9న విచారణకు రావాలంటూ స్పష్టీకరణ
- సోరెన్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది మూడోసారి
భూ కబ్జా కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబరు 9న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
హేమంత్ సొరెన్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. కిందటిసారి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈడీ నోటీసులు పంపింది. సోరెన్ ను, ఆయన భార్యను దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది.
ప్రస్తుతం భూ కబ్జా కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. జులై 8న ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సీఎం సొరెన్ బ్యాంకు ఖాతాకు చెందిన చెక్ బుక్ లభ్యమైంది. దాంతో ఈ భూ కబ్జా కేసులో సొరెన్ పేరును కూడా చేర్చారు.