Rain: వదలని వర్షం... మరోసారి నిలిచిపోయిన భారత్-పాక్ మ్యాచ్
- ఆసియా కప్ లో నేడు భారత్-పాకిస్థాన్ పోరు
- గ్రూప్-ఏలో తలపడుతున్న దాయాదులు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- వర్షం వల్ల మ్యాచ్ నిలిచే సమయానికి 11.2 ఓవర్లలో 51/3
ఆసియా కప్ లో ఇవాళ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. అయితే వర్షం మరోసారి మ్యాచ్ కు ఆటంకం కలిగించింది.
వర్షం వల్ల రెండోసారి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (6 బ్యాటింగ్), ఇషాన్ కిషన్ (2 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2 వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ 1 వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరుగుతోంది. ఇవాళ మ్యాచ్ కు వానముప్పు ఉందని వాతావరణ శాఖ ముందే చెప్పింది. దాయాదుల సమరాన్ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చిన వీక్షకులు, ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో నిరాశకు గురవుతున్నారు.