Hrithik Roshan: 'కహో నా ప్యార్ హై' సినిమా నుండి కరీనా తప్పుకోలేదు... తప్పించారు: అమీషా పటేల్

Kareena Kapoor Khan Was Asked To Leave Kaho Naa Pyaar Hai reveals ameesha
  • 23 ఏళ్ల క్రితం హృతిక్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా
  • రాకేశ్ రోషన్‌తో విభేదాలు రావడంతో కరీనాను తప్పించారని వెల్లడించిన అమీషా
  • ఆ తర్వాత తనకు అవకాశం వచ్చిందన్న కహో నా ప్యార్ హై నటి
సూపర్ డూపర్ హిట్ మూవీ 'కహో నా ప్యార్ హై' సినిమా నుండి కరీనా కపూర్ తప్పుకోలేదని, ఆమెను తప్పించారని ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ తెలిపారు. 2000లో హృతిక్ రోషన్ హీరోగా, అమీషా పటేల్ హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సంబంధించి అమీషా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా తొలుత కరీనా కపూర్‌ను అనుకున్నారని, కానీ ఆమెను తప్పించి తనను తీసుకున్నారని వెల్లడించారు.

కరీనాకు ఈ కథ ఎంతో నచ్చిందని, ఇందులో నటించాలని భావించిందని, కానీ ప్రారంభంలోనే రాకేశ్ రోషన్‌తో ఆమెకు విభేదాలు తలెత్తాయన్నారు. దీంతో సినిమా నుండి వెళ్లిపోవాలని రాకేశ్ చెప్పారని తెలిసిందని, అలా ఆమె సినిమా నుండి పక్కకు వెళ్లారని చెప్పారు.

కరీనాను బయటకు పంపించాక ఎవరిని తీసుకోవాలనే అంశంపై రాకేశ్ ఆందోళన చెందారని, ఓ పెళ్లిలో చూసి తనకు అవకాశం ఇచ్చారన్నారు. ఎలాంటి ట్రెయినింగ్ లేకుండా తాను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినట్లు చెప్పారు. హృతిక్ రోషన్‌తో పాటు తనకూ ఇది మొదటి చిత్రమని, మొదటి ప్రయత్నంలోనే తమకు మంచి పేరు వచ్చిందన్నారు.
Hrithik Roshan
Kareena Kapoor
ameesha patel
Bollywood

More Telugu News