Telangana: వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం
కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో బాధ పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.