GHMC: భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తం

GHMC alerted in the wake of heavy rain forecast

  • టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసిన బల్దియా
  •  040- 21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచన
  • డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తం

తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. గత అనుభవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. వర్షాల్లో నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య ఉన్న వాళ్లు 040- 21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించింది.

 డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను కూడా అప్రమత్తం చేసింది. మరోవైపు వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోయింది. నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉద్దృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News