SCR: 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. రూట్లు ఇవే!

SCR cancelled trains due to maintenance work

  • సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మతులు, ‌నిర్వహణ పనులు
  • ఈ రోజు నుంచి పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన
  • విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోనూ కొన్ని రైళ్ల రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనులు ఉండటంతో ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాజీపేట-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-కాజీపేట, విజయవాడ-భద్రాచలం రోడ్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌, వరంగల్‌-హైదరాబాద్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌ రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించారు. 

కాజీపేట్‌-డోర్నకల్, డోర్నకల్‌- విజయవాడ, భద్రాచలంరోడ్‌-విజయవాడ, కాజీపేట్‌-సిర్పూర్‌ టౌన్‌, బలార్షా-కాజీపేట్‌ రైళ్లు 5 నుంచి 11వ తేదీ వరకు రద్దయ్యాయి. సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌ , సికింద్రాబాద్‌-వరంగల్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌ రైళ్లను 5 నుంచి 11 వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్‌-బలార్షా రైలు 10 వరకు రద్దయింది. కరీంనగర్‌-నిజామాబాద్‌, కాజీపేట్‌-బలార్షా రైళ్లు కూడా 10వ తేదీ వరకు రద్దు చేశారు.  వీటితో పాటు విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో కూడా పలు రైళ్లను అధికారులు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News