Aadhaar update: సెప్టెంబర్ 14 వరకు ఆధార్ అప్ డేట్ సేవలు ఉచితం

Aadhaar update Update your name address and other details for free online before September 14
  • పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పులు చేసుకోవచ్చు
  • రూ.50 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
  • బయోమెట్రిక్, ఐరిష్ సేవలకు మాత్రం యథావిధిగా చార్జీ
ఆధార్ అప్ డేట్ సేవలను ఉచితంగా పొందే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి చార్జీ లేకుండా పౌరులు ఆధార్ సేవలను పొందొచ్చు. సాధారణంగా ఆధార్ లో వివరాల మార్పులకు (అప్ డేట్) సంబంధించిన అభ్యర్థనలకు రూ.50 చార్జీగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటూ ఉంటుంది. కానీ, మరో 10 రోజుల పాటు ఈ చార్జీలు లేకుండానే సేవలు పొందొచ్చు. 

పేరు, చిరునామా, పుట్టిన తేదీ, సంవత్సరం, లింగం, మొబైల్ నంబర్, ఈ మెయిల్ లో మార్పులు చేసుకోవచ్చు. ఆన్ లైన్  నుంచి రూపాయి చెల్లించకుండా ఈ సేవలను పొందొచ్చని యూఐడీఏఐ ప్రకటించింది. అయితే ఎవరైనా తమ ఫొటో లేదంటే ఐరిష్ లేదా బయోమెట్రిక్ వివరాలు మార్చుకోవాలంటే అందుకోసం సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు వీటికి నిర్ధేశిత ఫీజులను కూడా చెల్లించాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాల అప్ డేట్ కోసం అక్కడి సిబ్బంది అదనపు సమయం వెచ్చించాలి. వచ్చిన వ్యక్తి డెమోగ్రాఫిక్ వివరాలను తీసుకోవాలి. 

ప్రజలు ప్రతి పదేళ్లకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరుతోంది. తద్వారా ఆధార్ డేటాబేస్ లోని సమాచారం తాజాగా ఉండేటట్టు చర్యలు తీసుకుంటోంది.
Aadhaar update
name
address
change
free

More Telugu News