Rummy: రమ్మీ, పోకర్ అనేవి నైపుణ్య సంబంధిత ఆటలని తేల్చిన ఢిల్లీ ఐఐటీ

Delhi IIT confirms Rummy and Poker are skill related games
  • ఆన్ లైన్ రమ్మీ, పోకర్ లో భారీ మొత్తంలో డబ్బు కోల్పోతున్న వ్యక్తులు
  • కొందరికి వ్యసనంగా మారుతున్న వైనం
  • ఆన్ లైన్ రమ్మీ, పోకర్ పై అధ్యయనం చేపట్టిన ఢిల్లీ ఐఐటీ
  • తెలివితేటలా? అదృష్టమా? అనే అంశాలపై విశ్లేషణ 
  • అనుభవం ఉన్నవాళ్లు ఇందులో రాణిస్తారని వెల్లడి
ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వల్ల చాలామంది భారీ మొత్తంలో డబ్బు నష్టపోతుండడమే కాదు, అవి వ్యసనంలా మారుతున్నాయన్న వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ ఆసక్తికర అధ్యయనం చేపట్టింది. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ అనేవి నైపుణ్య సంబంధిత ఆటలు అని తేల్చింది. తెలివితేటలు ఉపయోగించి ఆడేవారే రమ్మీ, పోకర్ లో విజయవంతం అవుతారని స్పష్టం చేసింది. 

ఢిల్లీ ఐఐటీకి చెందిన ఏఐ, ఆటోమేషన్ విభాగం ప్రొఫెసర్ తపన్ కె గాంధీ, ఆయన బృందం 'ఆన్ లైన్ పోకర్, రమ్మీ నైపుణ్య సంబంధిత క్రీడలా లేక అదృష్టం మీద ఆధారపడిన వ్యవహారాలా?' అనే అంశంపై విస్తృతస్థాయిలో అధ్యయనం నిర్వహించింది. 

ఆన్ లైన్ రమ్మీ, పోకర్ లో దీర్ఘకాలం పాటు విజయవంతం కావాలంటే నైపుణ్యంతో పాటు అనుభవం, కిటుకులు వంటబట్టించుకునే సామర్థ్యం కూడా కీలకమని తపన్ కె గాంధీ బృందం వెల్లడించింది. ఆన్ లైన్ లో గానీ, ఆఫ్ లైన్ లో గానీ రమ్మీలో నైపుణ్యానిదే ప్రధాన భూమిక అని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని గణిత విధానాలను ఉపయోగించి, సమగ్ర విశ్లేషణ జరిపింది.
Rummy
Poker
Online Games
IIT Delhi
Skill
Online
India

More Telugu News