Elephant: మన్యం జిల్లాలో బస్సుపై దాడి చేసిన ఏనుగు... వీడియో ఇదిగో!

Elephant attacks on a bus in Manyam district
  • కొమరాడ మండలం ఆర్తాం రహదారిపై ఘటన
  • అడవిలోంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు
  • బస్సు అద్దాలు పగులగొట్టి వెనక్కి నెట్టేసిన వైనం
పార్వతీపురం మన్యం జిల్లాలో జనవాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. కొమరాడ మండలం ఆర్తాం వద్ద ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. పలు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఓ బస్సుపైనా దాడి చేసింది. తొండంతో అద్దాలు పగులగొట్టిన ఆ ఏనుగు... అంత పెద్ద బస్సును సైతం అవలీలగా వెనక్కి నెట్టేసింది. దాంతో అందరూ హడలిపోయారు. స్థానికులు కర్రలు తీసుకుని, పెద్దగా కేకలు వేస్తూ ఏనుగును తరిమివేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో దర్శనమిస్తోంది.
Elephant
Bus
Attack
Manyam District

More Telugu News