Manjrekar: జడేజా లేకుండా టీమిండియా ఏమీ చేయలేదు: మంజ్రేకర్

India cant do without Jadeja but dont compare him with Yuvraj Manjrekar after India hammer Nepal in Asia Cup

  • స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా మొదటి ప్రాధాన్యం అతడికే
  • 7, 8వ స్థానంలో వస్తే ప్రత్యర్థికి ముప్పుగా పేర్కొన్న మంజ్రేకర్
  • 10వ ఓవర్లలోనే ముగించేయగలడని వ్యాఖ్య

మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మద్దతుగా నిలిచాడు. ఆసియాకప్ లో భాగంగా నేపాల్ పై మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా కీలకంగా వ్యవహరించడం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో జడేజా స్థిరమైన ప్రదర్శన నేపథ్యంలో మంజ్రేకర్ అతడికి మద్దతుగా మాట్లాడాడు. 

‘‘సూపర్ స్టార్ జడేజా ప్రతి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే అవకాశం ఉందన్న స్పష్టత కనిపిస్తోంది. భారత జట్టుకు తొలి ప్రాధాన్య స్పిన్ బౌలింగ్, ఆల్ రౌండర్ గా అతడు నిలుస్తాడు. అతడు లేకుండా భారత్ ఏమీ సాధించలేదు. అక్సర్ పటేల్ కూడా అక్కడ రిజర్వ్ లో ఉన్నాడు. కానీ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా మొదటి అవకాశం జడేజాకే. పిచ్ రఫ్ గా ఉన్నా, నాణ్యమైన ప్రత్యర్థి ఉన్నా, అతడు 10 ఓవర్లలో ముగించేయగలడు’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 

2011లో యువరాజ్ సింగ్ రూపంలో బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అతడి బ్యాటింగ్ ను జడేజాతో పోల్చి చూడకూడదు. జడేజాని బౌలింగ్ ఆల్ రౌండర్ గా నేను చూస్తున్నాను. 7, 8వ స్థానంలో అతడి రాక ప్రత్యర్థికి ముప్పు ఏర్పడినట్టే. గడిచిన కొన్నేళ్లలో అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది’’ అని మంజ్రేకర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News