weight loss: బరువు తగ్గేందుకు చక్కని పానీయాలు

 morning weight loss drinks that are healthier than chai or coffee

  • నిమ్మ రసం కలిపిన నీటిని తాగొచ్చు
  • పసుపు, మిరియాల పొడితో మంచి ఫలితాలు
  • రెండు గ్లాసుల గోరువెచ్చని నీటితోనూ ప్రయోజనాలు

అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ఆరోగ్యం పట్ల అవగాహన విస్తృతం అవుతుండడంతో, నేడు చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. శారీరక వ్యాయామాలు ఒక్కటే కాకుండా, ఆహారపరమైన చిట్కాలతోనూ బరువు తగ్గే విషయంలో చక్కని ఫలితాలను పొందొచ్చు. 

బరువు తగ్గాలని కోరుకునే వారు ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటును పక్కన పెట్టేయాలి. ఎందుకంటే పరగడుపున వీటిని తాగడం వల్ల కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి పెరుగుతుంది. పోషకాలను జీర్ణ వ్యవస్థ సరిగ్గా గ్రహించలేదు. రక్తంలో షుగర్ స్థాయులు అస్థిరంగా మారతాయి. అందుకని బరువు తగ్గడంతోపాటు, ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలను పరిశీలించొచ్చు.

  • చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోతుంది. దీంతో బరువు తగ్గొచ్చు.
  • రెండు కప్పుల నీటిలో కొంత జీలకర్ర వేసి, కొంచెం సోంపు, కొంచెం వాము వేసి.. నీరు సగం తగ్గే వరకు కాచాలి. అనంతరం చల్లార్చుకుని తాగాలి. దీనివల్ల బరువు తగ్గడంతోపాటు, జీర్ణశక్తి బలపడుతుంది.
  • నిమ్మ చెక్క ఒకదాన్ని గోరువెచ్చని నీటిలో పిండుకోవాలి. కొంచెం తేనె కలుపుకుని తాగొచ్చు. కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవచ్చు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల శరీరంలోని హానికారకాలు బయటకు వెళతాయి.
  • ఇక ఇవేవీ కాకుండా ఉదయం లేచిన తర్వాత గ్లాసు లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగొచ్చు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచి జీవక్రియలను ప్రేరేపిస్తుంది. వ్యర్థాలు బయటకు పోయేందుకు వీలు పడుతుంది. 
  • వీటిల్లో ఏదైనా పానీయం తాగిన కొంత సమయం తర్వాత నీటిలో నానబెట్టిన బాదం, గుమ్మడి గింజలను తినొచ్చు. లేదంటే బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లొచ్చు. ఆ తర్వాతే టీ లేదా కాఫీ తాగడాన్ని పరిశీలించొచ్చు. 

  • Loading...

More Telugu News