Adimulapu Suresh: చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: ఆదిమూలపు సురేశ్

Chandrababu will go to jail says Adimulapu Suresh
  • చంద్రబాబు దొంగ అనే విషయం అందరికీ తెలుసన్న సురేశ్
  • ఐటీ నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్
  • ఇందులో నారా లోకేశ్ పాత్ర ఉందని వ్యాఖ్య
చంద్రబాబు దొంగ అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోర్టులను మేనేజ్ చేసుకుంటూ ప్రతిసారి తప్పించుకుంటున్నారని విమర్శించారు. పూర్తి ఆధారాలతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈసారి చంద్రబాబు అనే దొంగ దొరికిపోయారని, ముందు నుంచి తాము చెప్పుతున్నది నిజమనే విషయం ఇప్పుడు తేలిందని అన్నారు. ఈసారి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు కావాల్సిన వారికి అమరావతిలో కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలను చంద్రబాబు తీసుకున్నారని చెప్పారు. ఇందులో నారా లోకేశ్ పాత్ర కూడా స్పష్టంగా ఉందని అన్నారు.
Adimulapu Suresh
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News