Appolo Hospitals: ఉపాసన తాత ప్రతాప్ రెడ్డికి రూ. కోటి చెక్ అందించిన 'జైలర్' నిర్మాత

Jailer producer Kalanidhi Maran gived 1 Cr cheque to Appolo Hospitals
  • సూపర్ హిట్ అయిన రజనీకాంత్ 'జైలర్'
  • సామాజిక సేవకు కోటి డొనేట్ చేసిన నిర్మాత కళానిధి మారన్
  • పేద పిల్లల హార్ట్ ఆపరేషన్లకు ఈ డబ్బును వినియోగించాలని విన్నపం
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ చాలా సంతోషంగా ఉన్నారు. రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ లకు లాభాల్లో కొంత భాగాన్ని పంచారు. అంతేకాదు ఖరీదైన కార్లను బహూకరించారు. అక్కడితో ఆగిపోకుండా, లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఉపయోగించాలని నిర్ణయించారు. దీంతో అపోలో హాస్పిటల్స్ కు రూ. కోటి విరాళాన్ని ఇచ్చారు. అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్, కొణిదెల ఉపాసన తాతయ్య డాక్టర్ ప్రతాప్ రెడ్డిని శ్రీమతి కావేరీ కళానిధి కలిసి రూ. కోటి చెక్ అందించారు. వంద మంది నిరుపేద పిల్లల హార్ట్ ఆపరేషన్లకు ఈ డబ్బును వినియోగించాలని కోరారు. 

Appolo Hospitals
Jailer Movie
Kalanidhi Maran

More Telugu News