Pakistan: 45 మంది మహిళలపై పాక్ లో స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకం

Pakistan school principal arrested for rape blackmailing over 45 women fell victim

  • కరాచీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం
  • ఉద్యోగం పేరుతో లైంగిక కార్యకలాపాలు
  • సీసీటీవీ ఫుటేజీలు చూపించి బెదిరింపులు

పాకిస్థాన్ లోని కరాచీలో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై సాగించిన లైంగిక అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. టీచర్లను బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ మెమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రిన్సిపాల్ చేతిలో 45 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను చూపించి మహిళా టీచర్లను ప్రిన్సిపాల్ బెదిరించే వాడని తెలిసింది.

గఫూర్ ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియో క్లిప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా టీచర్ తో గఫూర్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో  చీకటి క్రీడ వెలుగు చూసింది. ప్రిన్సిపాల్ గఫూర్ కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు. వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ బెదిరించే వాడని తెలుసుకున్నారు. దీనిపై విచారణకు సర్కారు కమిటీని నియమించింది. గఫూర్ చేతిలో తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఐదుగురు మహిళలు ఇప్పటి వరకు ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News