Stock Market: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభాల్లో టెలికాం, హెల్త్ కేర్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 65,880కి చేరుకుంది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 19,611 వద్ద స్థిరపడింది. టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ తదితర సూచీలు లాభాల్లో ముగియగా... ఫైనాన్స్, రియాల్టీ, మెటల్, ఇన్ఫ్రా, ఐటీ తదితర సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.57%),  హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.36%), టైటాన్ (1.25%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.00%), ఐటీసీ (1.00%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.67%), యాక్సిస్ బ్యాంక్ (-1.66%), ఎన్టీపీసీ (-1.15%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.13%).

  • Loading...

More Telugu News