Revanth Reddy: అనగనగా ఓ కేసీఆర్.. వరి వేస్తే ఉరే అన్నాడు: రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy satirical tweet on telangana cm KCR

  • ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ వ్యంగ్యం
  • ఎరువులు ఫ్రీగా ఇస్తానని రైతులను ఎండలో నిలబెట్టాడని విమర్శ
  • వరి వేయొద్దని రైతులకు చెప్పి ఆయనే 150 ఎకరాల్లో వేశాడని ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ కేసీఆర్ హామీలను ఎండగట్టారు. అనగనగా ఓ కేసీఆర్ అంటూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి అంటూ ముగించారు. యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారంటూ ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తన ట్వీట్ కు జోడించారు. ఎండలో రైతులు గంటల తరబడి నిలుచునేలా చేశాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. రైతులకు కావాల్సిన ఎరువులను ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ట్వీట్ యథాతథంగా..

అనగనగా ఒక కేసీఆర్..
వరి వేస్తే ఉరన్నాడు.. ఆయనే 150 ఎకరాల్లో వేశాడు.

24 గంటల కరెంట్ అన్నాడు..
లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదు.

రైతులకు ఎరువులు ఫ్రీ అన్నాడు..
గంటల తరబడి క్యూల నిలబెట్టాడు.

‘‘కథలు’’ కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి.

  • Loading...

More Telugu News