magnesium: మీ ఆహారంలో ‘మెగ్నీషియం’ ఉందా..?
- మెగ్నీషియంతో నియంత్రణలో రక్తపోటు, మధుమేహం
- అలసిపోయిన వారికి దీనితో శక్తి
- మంచి నిద్రకు, ఒత్తిడి నుంచి ఉపశమనం
మెగ్నీషియం అనేది ఎంతో ముఖ్యమైన ఖనిజం. మన శరీరంలోని ఎన్నో జీవక్రియలకు ఇది అవసరం. దీన్ని తగినంత తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. కనుక తీసుకునే ఆహారంలో తగినంత మెగ్నీషియం ఉండేలా జాగ్రత్త పడాలి.
- ప్రయోజనాలు
రక్తనాళాలను వ్యాకోచించేలా మెగ్నీషియం చేస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. హైపర్ టెన్షన్ రిస్క్ తగ్గుతుంది. గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. - ఎముకల సాంద్రతకు మెగ్నీషియం కావాలి. ఎముకలు బలంగా ఉండేందుకు, ఆస్టియో పోరోసిస్ బారిన పడకుండా మెగ్నీషియం రక్షణనిస్తుంది.
- మెగ్నీషియంలో ఉన్న ప్రయోజనాల్లో ముఖ్యమైనది శక్తిని ఉత్పత్తి చేయడం. అలసిపోయినట్టుగా అనిపించే వారికి, తమ పనులు చేయడానికి శక్తి చాలడం లేదన్న భావనతో ఉండే వారికి మెగ్నీషియం అవసరం ఇంకా ఎక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు.
- ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడానికి మెగ్నీషియం కావాలి. మెదడుకు విశ్రాంతిని కూడా ఇస్తుంది. స్ట్రెస్ ను నియంత్రించి, మంచి నిద్రకు సాయపడుతుంది.
- మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి సమస్యకు మెగ్నీషియం ఔషధంగా పనిచేస్తుంది. రోజువారీ మెగ్నీషియం తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నొప్పులు, తిమ్మిర్లు రాకుండా చూస్తుంది.
- మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడే వారు రోజువారీ 400-500 మిల్లీ గ్రాముల మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- మధుమేహం నియంత్రణకు కూడా మెగ్నీషియం సాయపడుతుంది. మధుమేహం ఉన్న వారిలో సాధారణంగా మెగ్నీషియం లోపం కనిపిస్తుంటుంది. కనుక రోజువారీ ఆహారంలో మెగ్నీషియం లభించేలా చేసుకోవాలి.