nandigam suresh: పవన్ కల్యాణ్‌కు ఏమైనా ముడుపులు అందాయా?: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రశ్న

YSRCP MP Suresh questions Pawan Kalyan about IT notices to Chandrababu
  • చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
  • నోటీసులకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శ
  • ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాలన్న ఎంపీ నందిగం సురేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఐటీ నోటీసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పవన్‌కు ఏమైనా ముడుపులు అందాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగలా తిరుగుతున్నారన్నారు. కానీ ఇప్పుడైనా చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాలని హితవు పలికారు. ఐటీ శాఖ నోటీసులు పంపించడంతో ఆయన బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు.

గత కొన్నిరోజులుగా చంద్రబాబు అవినీతి బయటకు వస్తోందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడే టీడీపీ అధినేత ఇప్పుడు దానిని ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. ఆయనకు తన భవిష్యత్తు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కోడ్ భాషలో ఆయన డబ్బులను సమకూర్చుకున్నారని ఆరోపించారు. తండ్రికి నోటీసులు రావడంపై నారా లోకేశ్ స్పందించాలన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన చేస్తోంది ఓ పాదయాత్రనా? అని ఎద్దేవా చేశారు. ముడుపులు తీసుకున్నవారిలో లోకేశ్ కూడా ఉన్నారన్నారు.
nandigam suresh
YSRCP
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan

More Telugu News