IIT Mandi: హిమాచల్‌ప్రదేశ్ విపత్తులకు మాంసాహార వినియోగం కారణమన్న ఐఐటీ డైరెక్టర్

 IIT Mandi Directors Bizarre Logic On Landslides linking with non vegetarian food
  • అమాయక జీవాలను చంపడంతో ప్రకృతిలోని పరస్పరాధారిత వ్యవస్థ దెబ్బతింటోందన్న ఐఐటీ మండీ డైరెక్టర్
  • వీటి దుష్పరిణామాలు తక్షణం కనిపించకపోయినా భవిష్యత్తులో బయటపడతాయని హెచ్చరిక
  • మాంసాహారం మానేస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన వైనం
హిమాచల్‌ప్రదేశ్‌‌లో ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగం కారణమంటూ ఐఐటీ మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బేహారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మాంసాహారం కోసం అమాయక జంతువులను వధించడం వల్ల ప్రకృతితో వాటికున్న పరస్పరాధారిత సమతౌల్యం దెబ్బతింటోందని, ఫలితంగా పర్యావరణ విధ్వంసం జరుగుతోందని చెప్పుకొచ్చారు. వీటి దుష్ప్రభావాలు తక్షణమే కనిపించకున్నా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, మాంసాహారం తీసుకోబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం పెద్ద చర్చకు దారి తీసింది.
IIT Mandi
Natural Calamaties
Non Vegetarian food

More Telugu News