MS Dhoni: ట్రంప్ తో కలసి గోల్ఫ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ
- అమెరికా పర్యటనలో అరుదైన అవకాశం
- యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ కు హాజరైన ధోనీ
- ఆ మరుసటి రోజే ట్రంప్ తో గోల్ఫ్ గేమ్
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన అవకాశం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలసి, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గోల్ఫ్ ఆటలో పాలు పంచుకున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. ధోనీ తనదైన పొడవాటి జట్టుతో కనిపించగా, డొనాల్డ్ ట్రంప్ తలకు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఉన్నారు. ఒకరు క్రికెట్ సెలబ్రిటీ అయితే, మరొకరు అమెరికాలో ప్రముఖ రాజకీయ నేత కావడం ఆసక్తికి దారితీసింది.
‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రప్ ఎంఎస్ ధోనీ కోసం గోల్ఫ్ ఆటను ఏర్పాటు చేశారు. అమెరికాలోనూ తలా ఫీవరే’’ అంటూ ఓ యూజర్ ట్విట్టర్ పై (ఎక్స్) పోస్ట్ చేశారు. ధోనీ గ్రే కలర్ పాయింట్ పై బ్లూ షీటర్ట్ ధరించి ఉన్నారు. యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన ధోనీ, ఆ మరుసటి రోజు గోల్ఫ్ గేమ్ లో పాల్గొన్నారు. మొత్తం మీద ధోనీ అభిమానులకు ఈ గోల్ఫ్ గేమ్ మంచి కిక్కే ఇస్తోంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత సంతతి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ట్రంప్ ధోనీతో ఈ పోటీకి తెరతీశారా? అన్న సందేహం కొందరికి కలుగుతోంది.