Tamil Director: గుండెపోటుతో స్టూడియోలో కుప్పకూలిన తమిళ సినీ దర్శకుడు, నటుడు మరిముత్తు

Director actor G Marimuthu dies of heart attack while dubbing for a TV show

  • స్టూడియోలో ఉన్న సమయంలో తీవ్ర గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించగా మరణించినట్టు ప్రకటించిన వైద్యులు
  • కన్నుమ్ కన్నుమ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు జి.మరిముత్తు గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఆయన ‘ఎథిర్ నీచల్’ పేరుతో ఒక టెలివిజన్ షో చేస్తున్నారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో ఇందుకు సంబంధించి డబ్బింగ్ చేస్తున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

మరి ముత్తు చివరిగా రజనీకాంత్ జైలర్ సినిమాలో కనిపించారు. అంతకుముందు రెడ్ శాండల్ వుడ్ లోనూ నటించారు. మరి ముత్తు హఠాన్మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయనకు భార్య భాగ్యలక్ష్మీ, పిల్లలు అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని విరుగంబాక్కమ్ లోని నివాసానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం వరకు ఉంచి, అంత్యక్రియల కోసం స్వస్థలం థేనికి తరలిస్తారు. 

2008లో కన్నుమ్, కన్నుమ్ సినిమాతో మరిముత్తు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒకవైపు దర్శకుడిగా పనిచేస్తూనే, మరోవైపు తమిళ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ వచ్చారు. వాలి, జీవ, పరియేరుమ్ పెరుమాళ్, జైలర్ తదితర సినిమాల్లోని పాత్రలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. మరి ముత్తు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News