CM Ramesh: గతంలో జగన్ ను కూడా ఇంత అవమానకర రీతిలో అరెస్ట్ చేయలేదు: సీఎం రమేశ్

CM Ramesh reacts to Chandrababu arrest

  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్న సీఎం రమేశ్
  • పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం అని వెల్లడి
  • నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న సీఎం రమేశ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. ఇది అక్రమ అరెస్ట్ అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. 

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ చేయకుండా, నోటీసులు లేకుండా ఒక విపక్ష నాయకుడ్ని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. 

గతంలో జగన్ ను అరెస్ట్ చేసే ముందు ఆయనను అనేక పర్యాయాలు విచారించి, నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారని సీఎం రమేశ్ గుర్తు చేశారు. అంతేతప్ప, ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సీఎం రమేశ్ హితవు పలికారు. అదే సమయంలో పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News