Gopichand: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం

Gopichand and Sreenu Vaitla join hands for new movie
  • యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్
  • గోపీచంద్ కోసం తన ట్రేడ్ మార్క్ స్టోరీ సెట్ చేసిన శ్రీను వైట్ల
  • నేడు హైదరాబాదులో ప్రారంభోత్సవ కార్యక్రమం
  • ఓపెనింగ్ షాట్ కు క్లాప్ కొట్టిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
యాక్షన్ హీరో ఇమేజ్ తో వరుసగా సినిమాలు చేస్తున్న గోపీచంద్... తాజాగా దర్శకుడు శ్రీను వైట్లతో జట్టు కట్టాడు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కొత్త చిత్రం నేడు ప్రారంభమైంది. 

హైదరాబాదులో ఈ చిత్రం ముహూర్తం కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓపెనింగ్ షాట్ కు క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు. 

గోపీచంద్ ఈ సినిమాలో కొత్త లుక్కుతో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల... కొన్ని చిత్రాల పరాజయం తర్వాత బాగా విరామం తీసుకుని తన ట్రేడ్ మార్కు సబ్జెక్టును సిద్ధం చేసుకుని రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 

కాగా ఈ చిత్రానికి 'విశ్వమ్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Gopichand
Sreenu Vaitla
New Movie
Chitralayam Studios

More Telugu News