Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో

ISRO performs another orbit raising manoeuvre on aditya l1

  • బెంగళూరులోని ఇస్‌ట్రాక్ కేంద్రం నుంచి కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో
  • కక్ష్య పెంపు సమయంలో ఆదిత్య-ఎల్1 గమనాన్ని నిశితంగా పరిశీలన
  • ఆదిత్య-ఎల్1 ప్రస్తుతం 296 కి.మీ బై 71.767 కి.మీల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ఉందని వెల్లడి
  • సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది. ఈ సందర్భంగా మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్‌లో ఇస్రో కేంద్రాల నుంచి ఆదిత్య-ఎల్1 గమనాన్ని ఇస్రో నిశితంగా పరిశీలించింది. తాజా కక్ష్య మార్పుతో, ఈ మిషన్ తన గమ్యం దిశగా మరో ముందడుగు వేసినట్టైంది. 

ప్రస్తుతం ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ 296 కి.మీ బై 71,767 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోందని ఇస్రో వెల్లడించింది. సెప్టెంబర్ 15న రాత్రి 2.00 గంటల సమయంలో మరోమారు కక్ష్య పెంపు చేపడతామని ఇస్రో ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

  • Loading...

More Telugu News