VV Lakshminarayana: చంద్రబాబు కేసు.. ఆదివారం అయినా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయొచ్చు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Chandrababu can apply for bail in High Court says VV Lakshminarayana

  • చంద్రబాబు అరెస్ట్ కు గల కారణాలను వివరిస్తూ సీఐడీ ఆధారాలను చూపించాల్సి ఉంటుందన్న లక్ష్మీనారాయణ
  • చంద్రబాబును కస్టడీకి కోరినా ఆధారాలను చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • బెయిల్ కోసం వెంటనే హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ క్రమంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో 409 సెక్షన్ ఉండటం వల్లే 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నేరుగా ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే నేరం మోపినంత మాత్రాన సరిపోదని... చంద్రబాబు అరెస్ట్ కు గల కారణాలను వివరిస్తూ అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అని సీఐడీ బలమైన ఆధారాలను చూపాల్సి ఉంటుందని తెలిపారు. 

చంద్రబాబును కస్టడీకీ సీఐడీ కోరినా... దానికి గల కారణాలను చూపాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ కస్టడీ కోరకపోతే కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ రెండింటిలో ఏది జరిగినా వెంటనే హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని... ఈరోజు ఆదివారం అయినప్పటికీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News