Chandrababu: చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. కాసేపట్లో తీర్పు

ACB Court reserves judgement in Chandrababu case
  • ఏసీబీ కోర్టులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు
  • మరో అరగంటలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం
  • తీర్పుపై సర్వత్ర నెలకొన్న ఉత్కంఠ
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. కాసేపట్లో తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలనే పిటిషన్ ను కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అర గంటలో జడ్జ్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా... సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది.
Chandrababu
Telugudesam
ACB Court

More Telugu News