Chandrababu: చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలన్న పిటిషన్ పై ముగిసిన వాదనలు
- చంద్రబాబుకు సెప్టెంబరు 22 వరకు రిమాండ్
- హౌస్ అరెస్ట్ పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు
- ఆరోగ్యం, వయసు, హోదా దృష్ట్యా హౌస్ అరెస్ట్ విధించాలన్న సిద్ధార్థ లూథ్రా
- వ్యతిరేకించిన సీఐడీ తరఫు న్యాయవాది
- కాసేపట్లో నిర్ణయం వెలువరించనున్న న్యాయస్థానం
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.
అయితే, రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో ఉంచుకుని హౌస్ అరెస్ట్ విధించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ అంశంపై వాదనలు ముగియగా, మరికాసేపట్లో న్యాయమూర్తి తన నిర్ణయం వెలువరించనున్నారు.