Rain: వదలని వాన... భారత్-పాక్ మ్యాచ్ కు మరోసారి అంతరాయం

Rain stops India and Pakistan match again

  • శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ వర్షం
  • ఈసారి పాక్ ఇన్నింగ్స్ కు అడ్డు తగిలిన వరుణుడు
  • 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసిన భారత్
  • 11 ఓవర్లలో 2 వికెట్లకు 44 పరుగులు చేసిన పాక్
  • వర్షంతో నిలిచిన మ్యాచ్

సరిగ్గా వర్షాలు పడే సమయంలో శ్రీలంకలో ఆసియా కప్ పోటీలు నిర్వహిస్తుండడం ప్రతికూలంగా మారింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. ఇవాళ రిజర్వ్ డేలో ప్రారంభమైన మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. 

ఈ మ్యాచ్ లో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 11 ఓవర్లలో 2 వికెట్లకు 44 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి క్రీజులో ఫకార్ జమాన్ 14, మహ్మద్ రిజ్వాన్ 1 పరుగుతో ఆడుతున్నారు. పాక్ గెలవాలంటే ఇంకా 39 ఓవర్లలో 313 పరుగులు చేయాలి... చేతిలో 8 వికెట్లున్నాయి. 

ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా ఫలితం తేలాలన్నా పాక్ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపే వర్షం వల్ల మ్యాచ్ రద్దయిపోతే ఫలితం తేలకుండానే ముగుస్తుంది.

  • Loading...

More Telugu News