Chandrababu: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై నిన్న సుదీర్ఘ వాదనలు
- సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ దరఖాస్తుకు అవకాశం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. సీఐడీ వాదనలతో ఏసీబీ న్యాయమూర్తి ఏకీభవించారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను చూపిస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజమండ్రి కేంద్రకారాగారంలో ఆయనకు పూర్తి భద్రతను కల్పించామని, ఈ జైల్లో ఆయనకు ఎలాంటి ముప్పులేదన్న సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.
చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సీఐడీ తెలిపింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు. పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.