Gone Prakash Rao: తాను జైలుకి వెళ్లడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ అని జగన్ మనసులో ఉంది: గోనె ప్రకాశ్ రావు

Gone Prakash Rao condemns Chandrababu arrest

  • చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన గోనె ప్రకాశ్ రావు
  • తనను జైలుకు పంపినవాళ్లను జైల్లో వేయడమే జగన్ లక్ష్యమని వెల్లడి
  • అందుకే చంద్రబాబును జైలుకు పంపారని వ్యాఖ్యలు

తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, తదితర పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఆయన ఖండించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, తాను జైలుకు వెళ్లడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ అని జగన్ మనసులో ఉందని వెల్లడించారు. తనను జైలుకు పంపిన వారందరినీ జైల్లో వేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడని, అందుకే చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు. 

ఇక, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా గోనె ప్రకాశ్ రావు ధ్వజమెత్తారు. సజ్జల ఒక బ్రోకర్, అహంకారి, మోసగాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు... ఇలా సకలం సజ్జలేనని... సజ్జలకు సిగ్గు, శరం లేవని విమర్శించారు. 

"జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన అనుమానితుడు కాదా? జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలి. దమ్ముంటే సజ్జల, మంత్రులు చర్చకు రావాలి. ఇడుపులపాయకు రమ్మన్నా వస్తా" అంటూ గోనె ప్రకాశ్ రావు సవాల్ విసిరారు. గోనె ప్రకాశ్ రావు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News