Vikas Khanvilkar: స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో ఎలాంటి స్కాం జరగలేదు... వీడియో విడుదల చేసిన డిజైన్ టెక్ ఎండీ

Design Tech MD Vikas Khanvilkar reacts to Chandrababu arrest

  • స్కిల్  స్కాంలో ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్న డిజైన్ టెక్ ఎండీ ఖాన్విల్కర్
  • అవినీతి జరిగిందన్నది అవాస్తవమని వెల్లడి

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో సీమెన్స్ సంస్థతో పాటు డిజైన్ టెక్ కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కర్ ఓ వీడియో విడుదల చేశారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. కానీ కుంభకోణం జరిగిందంటూ చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబును తానెప్పుడూ కలవలేదని ఖాన్విల్కర్ వెల్లడించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో భాగంగా 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఒప్పందంలో భాగంగా రూ.371 కోట్ల విలువైన సామగ్రిని సరఫరా చేశామని చెప్పారు. పరికరాలు బాగా లేకున్నా, మరమ్మతులు వచ్చినా బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలోనే దీనికి సంబంధించిన షరతు ఉందని తెలిపారు. 

జీఎస్టీ కుంభకోణం ఉందనే ఆరోపణలు కూడా నిజం కాదని డిజైన్ టెక్ ఎండీ స్పష్టం చేశారు. ఇది సర్వీస్ ట్యాక్స్ కు సంబంధించిన అంశమని ఆయన వివరణ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు తమను సంప్రదించలేదని అన్నారు. ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News