Tanuku: తణుకులో బంగారం వ్యాపారి ఇంట్లో చోరీ.. కిలో బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

One kg gold and one lakh cash theft in Tanuku
  • అర్ధరాత్రి వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు సభ్యుల ముఠా
  • తాళ్లతో కట్టి.. కత్తులతో బెదిరించి చోరీ
  • తమ షాపులో పనిచేసే సూరజ్ పనేనని బాధితుడి ఫిర్యాదు
బంగారం వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు వారిని తాళ్లతో బంధించి పెద్ద ఎత్తున బంగారం, నగదు అపహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

ఐదుగురు సభ్యుల దొంగల ముఠా అర్థరాత్రి వేళ వ్యాపారి ఇంట్లోకి చొరబడింది. ఆపై ఆయన కుటుంబ సభ్యులను తాళ్లతో బంధించింది. కత్తితో బెదిరించి దాదాపు కిలో బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధిత వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ దుకాణంలో పనిచేసే సూరజ్ అనే యువకుడు మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడినట్టు బాధిత వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Tanuku
West Godavari District
Gold Theft
Andhra Pradesh

More Telugu News