Daniel Storm: లిబియాలో ఎటుచూసినా శవాల దిబ్బలే.. ఇప్పటికే 5,300 మందికిపైగా మృతి

Over 5300 dead and bodies recovered in Derna

  • డెర్నాలో డేనియల్ తుపాను విధ్వంసం
  • ఒక్క డెర్నా నగరంలోనే 5 వేల మందికిపైగా మృత్యువాత
  • రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో కుప్పలుగా మృతదేహాలు
  • కన్నీటిని అదుపు చేసుకుని తమ వారిని గుర్తిస్తున్న కుటుంబ సభ్యులు

తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. డేనియల్ తుపాను సృష్టించిన విలయంతో లిబియా అతలాకుతలమైంది. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఒక్క డెర్నాలోనే 5,300 మందికిపైగా మరణించి ఉంటారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతుల సంఖ్య మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ క్రీసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్‌సీ) వలంటీర్లు ముగ్గురు మరణించారు. 

దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కార్లు కాగితపు పడవల్లా తేలుతూ కొట్టుకుపోయాయి. వీధులు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకుంటున్న ప్రజలు కన్నీటితో తమ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సహా ఇతర దేశాలు సహాయ కార్యక్రమాల కోసం తమ బృందాలను లిబియా పంపాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే పనిలో ఉంది.

  • Loading...

More Telugu News