Varla Ramaiah: చంద్రబాబుపై ఆమెకు ఎంత ద్వేషం ఉందో అర్థమైంది: వర్ల రామయ్య

Varla Ramaiah press meet at TDP Central Office

  • పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియా సమావేశం
  • చంద్రబాబు అరెస్ట్ అనంతర ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్ల రామయ్య
  • సత్తెనపల్లిలో ఓ డీఎస్పీ టీడీపీ కార్యకర్త మెడపై మోకాలితో తొక్కిపెట్టాడని ఆరోపణ
  • ఓ మహిళా మంత్రి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుందని విమర్శ  
  • ఆమెతో పాటు పేర్ని నాని, అమర్నాథ్, అంబటిలకు చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరిక

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళుతున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం అని పేర్కొన్నారు. 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సత్తెనపల్లిలో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై డీఎస్పీ, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్త మెడపై డీఎస్పీ మోకాలితో తొక్కిపెట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి డీఎస్పీని సస్పెండ్ చేసి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం!

చంద్రబాబును అరెస్టు చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేయడాన్ని బట్టి ఆమెకు చంద్రబాబుపై ఎంతో ద్వేషం ఉందో అర్థమైంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు భార్య గురించి ఆ మహిళా వెకిలి మంత్రి తప్పుగా మాట్లాడుతారా? మా అధినేత భార్య భువనేశ్వరి గారి పట్ల మీరు చూపించిన వెకిలితనం జుగుప్సాకరంగా ఉంది. 

ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం. చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించాం. పూనమలై హైవే దగ్గర ఎన్ని ఎకరాల భూములు కొన్నారో అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుపాలు చేస్తాం. పేర్ని నాని, అమర్నాథ్, అంబటి రాంబాబుల చిట్టాలు కూడా మా వద్ద వున్నాయి. మేం అధికారంలోకి రాగానే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్ప కూడు తినిపిస్తాం. 

సిట్  కార్యాలయంలో స్వీట్లు పంచుకోవడమా?

ఏం సాధించారని సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటారు? జగన్ కొట్టేసిన 43 వేల కోట్లు రికవరి చేశారనా స్వీట్లు పంచుకున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి... చంద్రబాబును జైలుపాలు చేసిన అధికారులను పిలిచి వారికి స్వీట్లు తినిపించడం సబబా? 

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును చూసి జగన్ సంతోషిస్తున్నారు. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవదని జగన్ గ్రహించాలి. జగన్ వ్యవహారశైలి చాలా అభ్యంతరకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగా పోరాడే పార్టీ. ధర్మాన్ని మేం నమ్ముకున్నాం. న్యాయస్థానాలో ధర్మమే గెలుస్తుంది. టీడీపీ తప్పక విజయం సాధిస్తుంది, అధికారంలోకి వస్తుంది, మీ భరతం పడుతుంది.

  • Loading...

More Telugu News