Ethiopian Airlines: కాక్‌పిట్‌లో పొగలు.. వెనక్కి వచ్చి ఢిల్లీలో ల్యాండైన ఇథియోపియా విమానం

Flight to Addis Ababa returns to Delhi after smoke in cockpit
  • ఢిల్లీ నుంచి అడీస్ అబాబా వెళ్తున్న విమానం
  • కాక్‌పిట్‌లో పొగలు చూసి వణికిపోయిన ప్రయాణికులు
  • ప్రమాద సమయంలో విమానంలో 240 మంది ప్రయాణికులు
ఢిల్లీ నుంచి అడీస్ అబాబా వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాక్‌పిట్‌లో పొగలు రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఆ సమయంలో విమానంలో 240 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గత నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ఢీకొన్నాయి. ఇథియోపియన్ విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పార్క్ చేసి ఉన్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొట్టింది.
Ethiopian Airlines
Addis Ababa
Delhi Airport

More Telugu News