Luxury Cruise Ship: 200 మంది ప్రయాణికులతో వెళ్తూ గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన విలాసవంతమైన నౌక

Luxury Cruise Ship With More Than 200 Passengers Stranded In Remote Part Of Greenland

  • మూడు వారాల ట్రిప్ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక
  • ఈ నెల 22న తిరిగి తీరానికి చేరుకునేలా షెడ్యూల్
  • గ్రీన్‌లాండ్ రాజధాని నుక్‌కు 850 మైళ్ల దూరంలో చిక్కుకున్న నౌక
  • రెస్క్యూ షిప్ చేరుకోవడానికి మూడు రోజుల సమయం
  • షిప్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదంటున్న ఆపరేటర్ సంస్థ

200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన నౌక గ్రీన్‌లాండ్‌ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయింది. నౌకలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్టు షిప్ ఆపరేటర్ తెలిపారు. అయితే, రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు ఇక్కడకు చేరుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మూడు వారాల ట్రిప్ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ట్రిప్ కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు రూ. 27 లక్షలు (33 వేల డాలర్లు) వసూలు చేశారు. 

గ్రీన్‌ల్యాండ్ రాజధాని నుక్‌కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం నౌక చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అది సుదూరంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు అది సొంతంగా బయటపడే అవకాశం లేదని ఆర్కిటిక్ కమాండ్ తెలిపింది.  నౌకకు కానీ, అందులోని వారికి కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, అవసరమైనన్ని సౌకర్యాలు ఉన్నాయని షిప్ ఆపరేటర్ అయిన అరోరా ఎక్స్‌పెడిషన్స్ తెలిపింది. 

ఇప్పుడు తాము అందమైన ప్రదేశంలో ఉన్నామని అందులోని ప్రయాణికులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణికుల్లో ఇద్దరుముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, షిప్‌లో డాక్టర్ కూడా ఉన్నట్టు ఓ ప్రయాణికుడు తెలిపారు.

  • Loading...

More Telugu News