world record: ఒంటి నిండా కుమార్తె పేరుతో పచ్చబొట్లు.. ప్రపంచ రికార్డ్
- బ్రిటన్ వాసి ఎవాన్స్ సరికొత్త రికార్డు
- గతంలో 267 సార్లు శరీరంపై కుమార్తె పేరు
- ఇప్పుడు మరో విడత 400 సార్లు రాయించుకోవడంతో కొత్త రికార్డ్
బ్రిటన్ కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ (49) ఒక్క పనితో కూతురిపై ప్రేమను చాటడంతోపాటు, ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు. గతంలో తాను సృష్టించిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. తన ఏడేళ్ల కుమార్తె లూసీ పేరును తన శరీరంపై గతంలో 267 సార్లు పచ్చబొట్టు రూపంలో వేయించుకుని ప్రపంచ రికార్డును నమోదు చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి లూసీ పేరును మరో 400 సార్లు పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. దీంతో శరీరంపై ఒకే పేరును అధిక సంఖ్యలో (667సార్లు) కలిగి ఉన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధ్యపడింది.