K Kavitha: సుప్రీంకోర్టులో కవితకు స్వల్ప ఊరట
- లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు
- సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో కవిత పిటిషన్
- ఈ నెల 26 వరకు సమన్లను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. శుక్ర లేదా శనివారాల్లో ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈడీ సమన్లను వాయిదా వేయాలని ఆదేశించింది. దీంతో 26 వరకు సమన్లను వాయిదా వేసేందుకు ఈడీ అంగీకరించింది. ఈ క్రమంలో కవితకు స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు.